గనుల సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం!

కలం, వెబ్ డెస్క్​ : ఖనిజాల తవ్వకం, పన్నుల వ్యవస్థలో కీలక సంస్కరణలు తీసుకువచ్చే గనుల, ఖనిజాల సవరణ బిల్లు-2026 (MMDR Bill) లోక్‌సభలో ఆమోదం పొందింది. మూజువాణి ఓటుతో బిల్లును లోక్​సభ ఆమోదించింది.  కేంద్ర గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. విపక్షాల నిరసనల మధ్యే బిల్లుకు ఆమోదం లభించింది.

ఈ కొత్త చట్టం ద్వారా ఖనిజ సంపదపై రాష్ట్ర ప్రభుత్వాలు విధించే అపరిమిత పన్నులు, సెస్సులపై నిబంధనలు రానున్నాయి. పన్నుల విధానంలో సులభత, స్థిరత్వం తీసుకురావడం ద్వారా నూతన పెట్టుబడులను ఆకర్షించడం, మైనింగ్ రంగాన్ని వేగవంతం చేయడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.

లీజుదారులు తమ పరిధిలోని గనుల్లో ఇతర రకాల ఖనిజాలను కూడా వెలికితీసే సౌలభ్యం లభిస్తుంది. లిథియం, కోబాల్ట్, గ్రాఫైట్ వంటి వ్యూహాత్మక ఖనిజాల అన్వేషణకు ఈ బిల్లు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. పారదర్శక వ్యాపారం కోసం డిజిటల్ మినరల్ ఎక్స్ఛేంజీల ఏర్పాటుకు నియమాలు రూపొందించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>