Mobile Popup Ad
Mobile Popup Ad

విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

కలం, భువనగిరి బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని భువనగిరి (Bhongir) ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Anil Kumar Reddy) తెలిపారు. భువనగిరి కలెక్టరేట్‌లో 99 రోజుల ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా భువనగిరి జిల్లా పరిధిలోని సర్పంచులు, కౌన్సిలర్లకు నిర్వహించిన కార్యశాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే (MLA Anil Kumar) మాట్లాడుతూ.. నియోజకవర్గానికి ఒక పబ్లిక్ స్కూల్ మంజూరు చేయడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై మరింత శ్రద్ధ పెట్టే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆధునిక సదుపాయాలు, మెరుగైన బోధనతో ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

ఉత్తీర్ణతా శాతం.. విద్యా ప్రమాణాలకు నిదర్శనం

ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తీర్ణత శాతం ఎక్కువగా నమోదవుతుండటం ప్రభుత్వ విద్యా ప్రమాణాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన స్వాగత నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం స్వాగత నృత్యం ప్రదర్శించిన విద్యార్థులకు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, విద్యాశాఖ అధికారులు, భువనగిరి మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్, కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read Also: హరీశ్ రావు ఆధ్యాత్మిక బాట వెనుక ఆంతర్యమేమిటి!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>