రీసర్వే పనుల్లో జాప్యం వద్దు.. అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశాలు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ (Mahabubnagar) రూరల్ మండలం జమిస్తాపూర్ (Zamistapur) గ్రామంలో చేపడుతున్న రీసర్వే పనులను రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్‌బీ హరిప్రియ బుధవారం పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న రీసర్వే ప్రక్రియ, పనుల పురోగతిని ఆమె సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

క్యాడాస్ట్రల్‌ పరిధిలో లేని గ్రామాల రీసర్వే పనులను నిబంధనల ప్రకారం.. పారదర్శకంగా, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ (AD SLR) అశోక్, మహబూబ్‌నగర్ రూరల్ మండల తహశీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>