Mobile Popup Ad
Mobile Popup Ad

​ముదిరాజ్ కులస్తులను బీసీ-ఏ లో చేర్చొద్దు : కోటేశ్ కుమార్

కలం, కరీంనగర్ బ్యూరో : ముదిరాజ్ కులస్తులను బీసీ-డీ (BC-D) గ్రూప్ నుండి బీసీ-ఏ (BC-A) గ్రూప్‌లోకి మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర బీసీ-ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గడప కోటేశ్ కుమార్ (Gadapa Kotesh Kumar) ఒక ప్రకటనలో తెలిపారు. ​బీసీ-ఏ గ్రూప్‌లో ఉన్న కులాలు ఇప్పటికే తీవ్ర వెనుకబాటుతనానికి గురై, సరైన ఉపాధి లేక, జీవనోపాధి కరువై ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా, సామాజికంగా ఎంతో సంపన్న వర్గానికి చెందిన ముదిరాజ్‌లను తీసుకువచ్చి బీసీ-ఏ లో కలపడం వల్ల, ప్రస్తుతం ఈ గ్రూప్‌లో ఉన్న పేద కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాబట్టి ముదిరాజ్‌లను బీసీ-డీ నుండి బీసీ-ఏ కి మార్చాలనే ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బీసీ-ఏ లో ఉన్న 57 కులాలు విద్య, ఆర్థిక, రాజకీయంగా తీవ్ర వెనుకబాటుతనంతో జీవిస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ​

ఈ సమావేశంలో బీసీ-ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గడప కోటేశ్ కుమార్ (గంగపుత్ర)తో పాటు జిల్లా సెక్రటరీ జంపాల నర్సయ్య (నాయిబ్రాహ్మణ), ట్రెజరర్ ​ జంగం సురేశ్, (నాయిబ్రాహ్మణ) ​శ్రీరాముల రమేశ్, అలిపి రెడ్డి లచ్చయ్య (మేదరి), ​ఏకుల రమేశ్ (మేదరి), ​శంకర్ (రజక) తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>