కలం, వెబ్ డెస్క్: తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ (Maoist Devji) .. మావోయిస్ట్ పార్టీలో అగ్ర నేతగా ఉంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. ఆపరేషన్ కగార్‌తో సుదీర్ఘ ఉద్యమ జీవితాన్ని వదిలి ఇటీవలే జనజీవన స్రవంతిలో కలిశారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాక ఇక చదువు మీద ఫోకస్ పెట్టిన దేవ్ జీ.. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కోరుట్లలో పరీక్ష రాసేందుకు విద్యార్థిలా వచ్చి.. అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఇంటర్ చదువు మధ్యలోనే వదిలేసి..
కోరుట్ల పట్టణానికి చెందిన దేవ్ జీ (Maoist Devji).. 1985లో మావోయిస్ట్ పార్టీ పట్ల తీవ్రంగా ఆకర్షితులై అడవుల్లోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో.. ఆయన కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు. ఇక పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ.. ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు చేరుకున్నారు. నంబాల కేశవరావ్ ఎన్‌కౌంటర్ తరువాత బయటకు వచ్చే వరకు పార్టీని ఆయనే నడిపించారు. నిర్బంధం తీవ్రం కావడంతో ఉద్యమాన్ని వదిలేశారు. న్యాయ విద్య చదవడమే తన లక్ష్యమని ఇప్పటికే చెప్పిన దేవ్ జీ.. 45 ఏళ్ల కిందట ఆపేసిన ఇంటర్ చదువుతో మళ్లీ కాలేజీ బాట పట్టారు.
Read Also: భగ్గుమంటోన్న ఇంధన ధరలు.. ఎయిరిండియా సంచలన నిర్ణయం
Follow Us On : WhatsApp

