అలా ఉంటే మమతా బెనర్జీ గెలిచేవారు: టీపీసీసీ చీఫ్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఆదాయాన్ని పొదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ప్రజలు ఆదాయాన్ని పొదుపు చేస్తారని.. కేంద్ర ప్రభుత్వమే పొదుపు చేయాలని చెప్పారు. సంపన్నులు బంగారం కొంటారని.. బీదవాళ్ళు పెళ్లి సమయంలోనే బంగారం కొంటారని అన్నారు.కేసీఆర్ రెండున్నర ఏళ్ళ నుండి పామ్ హౌస్ లో ఉండి ప్రజా జీవితానికి దూరం అయ్యారని విమర్శించారు. కేసీఆర్ ప్రతి పక్షాలు లేకుండా చేశాడని.. కానీ తాము ప్రతి పక్షాలు ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్‌ను తామెప్పుడూ అగౌరవపరచలేదని అన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ పై కేటీఆర్ భాష చెత్తగా ఉందని చురకలు అంటించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో కన్నా ఈసారి వడ్లు, మొక్కజొన్న దిగుబడి పెరిగిందని అన్నారు. ఎప్పటి కప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.

కలిసి పోటీ చేసినా ఇబ్బంది లేదు..

టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి తెలంగాణలో పోటీ చేసినా ఇబ్బంది లేదని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా ఓటింగ్ పర్సెంటేజ్ ముప్పై శాతం దాటదని అన్నారు. మంత్రి పదవి కంటే పీసీసీ చీఫ్ గా సంతోషంగా, గర్వంగా ఉన్నానని చెప్పారు. 12 ఏండ్ల నుండి పొదుపు గురించి ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. క్రూడ్ ఆయిల్ ధర సగం తగ్గితే పెట్రోల్ ధర సగం పెంచారని విమర్శించారు. కమ్యూనిస్టులు అయిపోయారు అనుకుంటే పొరపాటేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రజా స్వామ్య బద్దంగా గెలవలేదని అన్నారు. 93 లక్షల ఓట్లు తొలగించి 31 లక్షల ఓట్లు యాడ్ చేశారని ఆరోపించారు. తమ ఓట్లు పోయాయని 60 లక్షల మంది అప్లికేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వలేదని అన్నారు. ముప్పై లక్షలు ఉంటే మమతా బెనర్జీ గెలిచి ఉండేవారని అభిప్రాయపడ్డారు. SIR పేరుతో తెలంగాణలో సెక్యులర్ ఓట్లు తొలగించి గెలవాలని బీజేపీ చూస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ పర్యటన దానికోసమే అని అనుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఎవరి ఓట్ వారు కాపాడుకోవాలని దిశానిర్దేశం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>