Mobile Popup Ad
Mobile Popup Ad

రైతులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఖరీఫ్ కు సంబంధించి కనీస మద్దతు ధర(MSP Hike)ను ప్రకటించింది. ఖరీఫ్ సేకరణకు రూ. 2.60 లక్షల కోట్లకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. వరి పంట కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ. 2,461గా నిర్ణయించింది. వివిధ పంటలకు సంబంధించి కనీస మద్దతు ధర కోసం (ఎంఎస్‌పీ)పై వ్యవసాయశాఖ చేసిన సిఫారసులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రైతులకు భారీ ఊరట లభించనుంది.ఈ నిధులతో దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు, నిల్వ, పంపిణీ ప్రక్రియలను చేపట్టనున్నారు. ఖరీఫ్‌లో 824.41 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ధాన్యం సేకరణ కోసం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని విస్తృత ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.

రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఎంఎస్‌పీ పెంపు (MSP Hike) నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. మార్కెట్‌లో ధరల స్థిరీకరణకు ఈ విధానం సహాయపడుతుందని భావిస్తోంది. ఖరీఫ్ పంటల సాగును ప్రోత్సహించడంలో ఈ నిర్ణయం కీలక పాత్ర పోషించనుందని అంచనా వేస్తున్నారు. రాబోయే సీజన్‌లో వ్యవసాయ రంగానికి ఇది పెద్ద ఊతంగా నిలవనుంది.

2026 సీజన్‌కు పంటల కనీస మద్దతు ధరల వివరాలు..

పంట                           ధర (క్వింటాల్‌కు)

వరి (సాధారణ రకం ) – రూ. 2,441
వరి (గ్రేడ్ A – రూ. 2,461
జొన్న (హైబ్రిడ్) – రూ. 4,023
జొన్న (మాల్దాండి) – రూ. 4,073
సజ్జ – రూ. 2,900
రాగి – రూ. 5,205
మొక్కజొన్న – రూ. 2,410
కందులు – రూ. 8,450
పెసర (Moong)                – రూ. 8,780
మినుములు (Urad)           – రూ. 8,200
పత్తి (మధ్యతరహా ఫైబర్)     – రూ. 8,267
పత్తి (పొడవైన ఫైబర్)          – రూ. 8,667
వేరుశనగ                        – రూ. 7,517
పొద్దు తిరుగుడు విత్తనాలు – రూ. 8,343
సోయాబీన్ (పసుపు రకం)   – రూ. 5,708
నువ్వులు                     – రూ. 10,346
ఆముదం గింజలు      – రూ. 10,052

Read Also: జన జీవన స్రవంతిలోకి మావోయిస్టు అగ్రనేత!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>