కలం, వెబ్ డెస్క్: తెలంగాణ నుంచి ఏపీలోని ఏలూరు(Eluru) జిల్లాలోకి ప్రవేశించిన పెద్ద పులి(Tiger) జిల్లాలో పలు గ్రామాల ప్రజలను హడలెత్తిస్తోంది. చుట్టుపక్కల గ్రామాల్లో ఆవులపై పులి దాడులు చేస్తుండటంతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ప్రస్తుతం పులి ఏలూరులోని బుట్టాయగూడెం(Buttayagudem) మండలంలో సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు పులి ఐదు ఆవులపై దాడి చేసినట్లు వెల్లడించారు. పందిరిమామిడిగూడెం, కామవరం, అంతర్వేదిగూడెం, నాగులగూడెం ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు తెలిపారు. పులి కదలికలను గుర్తించేందుకు చుట్టు పక్కల గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు 20 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలం పనులకు వెళ్లే రైతులు ఒంటరిగా వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు.


