కలం, జనగామ: జనగామ (Jangaon) జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. లింగాలగణపురం మండలం బండ్లగూడెం పరిధిలోని బండగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు వరయోరు లక్ష్మీ నరసింహాచార్యులు, ఆయన కుమారుడు పవన్ కుమార్ ఆచార్యుల మృతదేహాలు ఆలయ కోనేరులో ప్రత్యక్షమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం ఉదయం ఆలయ కోనేరులో ఇద్దరి మృతదేహాలు తేలియాడుతున్నట్లు గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను కోనేరులో నుంచి వెలికితీశారు. తండ్రీకొడుకుల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తు కోనేరులో పడ్డారా? లేక మరేదైనా కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ఆలయ పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అర్చకుల మృతితో భక్తులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
Read Also: కూతురిని రూ.20 లక్షలకు అమ్మి బలవంతపు వివాహం!
Follow Us On: Instagram

