Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్‌ ఆకునూరి మురళి రాజీనామా

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్‌, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి (Akunuri Murali) తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుకు పంపారు. ఆయన పదవీ కాలం ముగియడానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. అయినప్పటికీ ముందే రాజీనామా చేయడం ఇప్పుడు రాజకీయ, విద్యా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అయితే తన రాజీనామాపై ఆకునూరి మురళి స్పందిస్తూ.. తనకు తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్‌పర్సన్‌గా సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. విద్యా కమిషన్ చైర్మన్గా విద్యపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించానని, ప్రభుత్వం ఇచ్చిన పనిని పూర్తి చేయడంతో తాజా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

Read Also: భూదాన్ భూముల కబ్జా.. ఖమ్మంపై ఈడీ గురి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>