కలం, మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ వానాకాలం – 2026 సీజన్ కోసం 50% సబ్సిడీ (సగం ధరకే) పై పచ్చి రొట్టె విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) అర్బన్ మండలంలో మేయర్ మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ శేఖర్ చేతుల మీదుగా విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ గుమ్మాల మమతా శ్రీనివాస్ మాట్లాడుతూ.. భూసారాన్ని పెంపొదించే ఈ విత్తనాలను రైతులందరికి ప్రభుత్వం సబ్సిడీ పై సగం ధరకే అందిస్తోందని తెలిపారు. సబ్సిడీ పై రైతులకు జీలుగ విత్తనాల బస్తా (30 కిలోలు): అసలు ధర రూ. 2452.50, జనుము విత్తనాల బస్తా (40 కిలోలు): అసలు ధర రూ. 3,110 ధర ఉంటుందన్నారు. వీటిపై 50% రాయితీ ఉంటుందని, ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, రైతు బీమా, సబ్సిడీ పై వ్యవసాయ యంత్ర పరికరాలను, విత్తనాలను ఇతర ఎన్నో పథకాలను రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తోందని ఆమె అన్నారు. సబ్సిడీ పై పచ్చి రొట్టె ఎరువు విత్తనాలను ఇవ్వటం వలన రసాయన ఎరువుల ఖర్చు తగ్గించుకొని, భూసారాన్ని పెంచుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్ రెడ్డితో పాటు మండల వ్యవసాయ శాఖ అధికారి పి.శ్రీనివాసులు, ఏఈఓలు నవీన్, సునీత, స్థానిక నాయకులు, మన ప్రాంత రైతు సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Read Also: మంత్రి ఉత్తమ్ తో కర్ణాటక మంత్రి బోసు రాజు కీలక భేటీ
Read Also: ఏసీబీ దూకుడు.. కటకటాల్లోకి కరప్షన్ కింగ్స్!

