Mobile Popup Ad
Mobile Popup Ad

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్యే ధన్ పాల్

కలం, నిజామాబాద్ బ్యూరో : ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) విమర్శించారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ” రైతు గోస బీజేపీ భరోసా” కార్యక్రమంలో భాగంగా సోమవారం వికారాబాద్ జిల్లా కులకచర్ల మార్కెట్ కమిటీ, గజ్వేల్ ధాన్యం కేంద్రాలను రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ఎంపీలు, సహచర ఎమ్మెల్యేలతో కలిసి దన్ పాల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 45 రోజులు దాటినా గన్నీ బస్తాలు ఇవ్వకుండా, కాంటా పెట్టకుండా, కొన్ని చోట్ల తూకం వేసినా బస్తాలను తరలించేందుకు లారీలు లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరంగల్‌ సభలో రాహూల్‌ గాంధీ రైతు డిక్లరేషన్‌ పేరిట అనేక హామీలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. డిక్లరేషన్‌ పేరుతో హామీలిచ్చి అమలు చేయని రైతు ద్రోహి సీఎం రేవంత్‌రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతును కాంగ్రెస్‌ పార్టీ నిలువునా మోసం చేస్తున్నదని ఆరోపించారు. మొక్కజొన్న పండించిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని చెప్పారు. రైతుల కష్టాలను పరిష్కరించాల్సిన ప్రభుత్వ పెద్దలు ఏసీ గదులకు పరిమితం అయ్యారని ఎమ్మెల్యే ధన్ పాల్ (Dhanpal Suryanarayana) దుయ్యబట్టారు.

Read Also: ‘ఉనికి’ పోరు.. ‘GHMC’ ఫైట్.. బీఆర్ఎస్ అస్త్రాలు అవేనా!!

Read Also : దోషం.. దోపిడీ

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>