Mobile Popup Ad
Mobile Popup Ad

కోకో గాఫ్ ఓపెన్ కామెంట్స్.. తప్పులే తనకు పాఠాలు నేర్పించాయంటూ వ్యాఖ్యలు

కలం, వెబ్‌డెస్క్: చిన్న వయసులోనే స్టార్‌డమ్ రావడం అంత సులువు కాదు. ఆ ఒత్తిడి, ఆ పరిశీలన, ఆ విమర్శలు.. ఇవన్నీ అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ (Coco Gauff) చాలా దగ్గరగా అనుభవించింది. ఇప్పుడు అదే విషయంపై గాఫ్ ఆసక్తికరంగా స్పందించింది. 2019 వింబుల్డన్‌లో కేవలం 15 ఏళ్ల వయసులోనే వీనస్ విలియమ్స్‌ను ఓడించి కోకో గాఫ్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత మహిళల టెన్నిస్‌లో అమెరికా కొత్త ఆశగా మారింది. 2022 ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరడంతో ఆమెపై అంచనాలు, ప్రజల దృష్టి మరింత పెరిగాయి. 2026 ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ డిఫెండ్ చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో గాఫ్ తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంది.

ప్రజల మధ్య పెరగడం వల్ల చేసే ప్రతి తప్పు అందరికీ కనిపిస్తుందని ఆమె తెలిపింది. అయితే దాన్ని పూర్తిగా చెడు విషయంగా తాను చూడనని, తనను చూసి ఇతరులు కూడా ఎవరూ పర్ఫెక్ట్ కాదని అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పింది. ఈసారి రోలాండ్ గారోస్ తొలి మ్యాచ్‌లో గాఫ్.. అమెరికాకే చెందిన టేలర్ టౌన్‌సెన్డ్‌తో తలపడనుంది. ఇక ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్ గురించి కూడా గాఫ్ స్పందించింది. 2022లో ఇగా స్వియాటెక్‌తో జరిగిన ఫైనల్‌ను గుర్తుచేసుకుంటూ.. ఆ మ్యాచ్‌లో తీవ్రంగా నర్వస్‌గా ఫీలైనట్లు తెలిపింది.

ఆ ఫైనల్‌లో తన ఆటను ఆడలేకపోయానని, ట్రోఫీ కార్యక్రమంలో మరోసారి అలాంటి ఓటమి ఎదుర్కోవద్దని తనలో తాను అనుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు అరినా సబలెంకతో జరిగిన ఫైనల్ మాత్రం భిన్న అనుభవం ఇచ్చిందని తెలిపింది. ప్రేక్షకులు భారీగా తనకే మద్దతుగా నిలవడం చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పింది. అలాగే ప్రముఖ దర్శకుడు స్పైక్ లీ తన టవల్ బాక్స్ పక్కనే ఉండటం కూడా తనకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని వెల్లడించింది. ఆ ఫైనల్‌లో గాఫ్.. సబలెంకాపై 6-7, 6-2, 6-4 తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు మరో ఫ్రెంచ్ ఓపెన్ సవాల్ ముందున్న వేళ.. కోకో గాఫ్ (Coco Gauff) ప్రదర్శనపై టెన్నిస్ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.

Read Also: రైతు సమస్యలపై కేటీఆర్–కవితల రాజకీయ యుద్ధం

Follow Us On:  X (Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>