Mobile Popup Ad
Mobile Popup Ad

స్వీట్లు తినడానికి సరైన సమయం ఏది? నిపుణులు చెప్పిన నిజాలు

కలం, వెబ్ డెస్క్: పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు ఇలా సందర్భం ఏదైనా సరే టేబుల్ పై స్వీట్లు పక్కా ఉండాల్సిందే. నోరూరించే మిఠాయిలను చూస్తే ఎవ్వరైనా సరే డైటింగ్ పక్కనపెట్టి లాగించేస్తారు. అయితే, చాలా మందిని వేధించే ప్రధాన సందేహం ఏంటంటే.. అసలు స్వీట్లు తినడం (Eating Sweets) ఆరోగ్యానికి మంచిదేనా? వాటిని ఏ సమయంలో తినాలి? అని. దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

స్వీట్లు ఆరోగ్యానికి తక్షణ శక్తిని ఇస్తాయి. అయితే స్వీట్లను పరిమితంగా తినడం వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ పరిమితికి మించి స్వీట్లు తింటే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా స్వీట్లు ఎంత తింటున్నామన్న దానికంటే ఎప్పుడు తింటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. సరైన సమయంలో తినకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

స్వీట్లు ఏ సమయంలో తినకూడదు:

ఉదయం ఖాళీ కడుపుతో స్వీట్లు తినకూడదు. ఖాళీ కడుపుతో తినడం వలన వాటిలోని చక్కెర వేగంగా రక్తంలోకి చేరి రక్తంలో ఒక్కసారిగా చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు దాన్ని నియంత్రించేందుకు శరీరం ఎక్కువ ఇన్సులిన్ ను విడుదల చేస్తుంది. ఆ తర్వాత చక్కెర స్థాయిలు త్వరగా తగ్గిపోవడంతో అలసట, నీరసం, మళ్లీ తీపి తినాలనే కోరిక కలుగుతుందని చెబుతున్నారు.

రాత్రి పడుకునే సమయంలో స్వీట్లు తినకూడదు. ఎందుకంటే ఆ సయమంలో శరీరం కేలరీలను పూర్తిగా వినియోగించుకోలేదు. కాబట్టి ఈ కేలరీలు కొవ్వుగా పేరుకుపోవడం, బరువు పెరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

సరైన సమయం ఏది?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం లేదా మధ్యాహ్నం భోజనం తర్వాత పరిమిత మోతాదులో స్వీట్లు తీసుకోవడం మంచిది. ఈ సమయంలో తినడం వలన భోజనంలో ఉండే ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు చక్కెర శోషణను నెమ్మదించడంలో సహాయపడతాయి. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా ఉంటాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>