కలం, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) వైసీపీని గొడ్డలి పార్టీ అనడంపై మాజీ మంత్రి విడదల రజినీ (Vidadala Rajini) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని గొడ్డలి పార్టీ ఎందుకు అంటారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో పేదల చదువుల కోసం అమ్మ ఒడి లాంటి పథకాన్ని తీసుకొచ్చినందుకు గొడ్డలి పార్టీ అంటారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ హయాంలో ప్రజల కోసం ఆరోగ్య శ్రీ కవరేజీని 25 లక్షలకు పెంచి, ఆరోగ్య ఆసరా, తల్లీ బిడ్డా ఎక్స్ ప్రెస్ తీసుకొచ్చి, ఎక్కడా మందుల కొరత లేకుండా చూసి, మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టామని చెప్పారు.
ప్రతి వర్గానికి వైసీపీ హయాంలో న్యాయం జరిగిందన్నారు. ప్రజలకు మంచి చేశామని, అక్కచెల్లెళ్ల పేరు మీద పెద్ద ఎత్తున ఇండ్ల పట్టాలు ఇచ్చామని స్పష్టం చేశారు. కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, లా నేస్తం ఇచ్చినట్లు గుర్తు చేశారు. చేయూత, ఆసరాతో పేదలను ఆదుకున్నామన్నారు. ఎందుకు సీఎం చంద్రబాబు వైసీపీని గొడ్డలి పార్టీ అంటారో సమాధానం చెప్పాలని ఆమె (Vidadala Rajini) డిమాండ్ చేశారు.
Read Also: బీజేపీని కార్నర్ చేసేందుకు కాంగ్రెస్‌కు అస్త్రం
Follow Us On: X(Twitter)

