ఛత్తీస్‌గఢ్‌లో విషాదం.. ముగ్గురు జవాన్లు మృతి

కలం, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నారాయణ్‌పూర్ జిల్లాలో ఐఈడీ పేలి ముగ్గురు జవాన్లు మరణించారు. మరో జవాన్‌కు తీవ్ర గాయాలు కాగా, వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరింత మెరుగైన చికిత్సం కోసం రాయ్‌పుర్‌కు పంపించారు. మావోయిస్టులు అమర్చిన ఐఈడీలను వెలికి తీసే ఉద్దేశంతో నారాయణ్‌‌పూర్–కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లోని ఛోటాభేటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కబేడ అడవుల్లో బాంబ్ డిస్పోజల్ టీం, నారాయణపూర్ జిల్లా పోలీసులు, డీఆర్జీ జవాన్లు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఐఈడీ డంప్ గుర్తించి, దాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించింది. ఇన్ స్పెక్టర్ సుక్రం వట్టి, కానిస్టేబుళ్లు క్రిష్ణ కోమ్రా, సంజయ్ గడ్‌‌పాలే మరణించారు. మరో కానిస్టేబుల్ పరమానంద్ కోమ్రా తీవ్రంగా గాయపడినట్లు జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.

Read Also: తెలంగాణ టెంపుల్ టూరిజం : మన గుడులు.. మన సంస్కృతి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>