ఇండియా లో పెరుగుతున్న డింక్​ కల్చర్..!

కలం, సెంట్రల్​ డెస్క్ : నాడు అరవై మంది ఉండే ఉమ్మడి కుటుంబం.. డింక్ కల్చర్ (DINK Lifestyle)​​ పుణ్యమా అని నేడు ఇద్దరికే పరిమితమైంది. రక్త సంబంధాల కంటే వ్యక్తిగత స్వేచ్ఛకే నేటి తరం ప్రాధాన్యత ఇస్తున్నది. బాధ్యతలను భారంగా భావిస్తూ.. పిల్లలు లేని ప్రపంచం వైపు యువత అడుగులు వేస్తున్నది. ఒకప్పుడు మన దేశంలో ఉమ్మడి కుటుంబాలే సమాజానికి పునాది. తాతలు, తండ్రులు, చిన్నాన్నలు అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంగా ఒకే గొడుగు కింద ఉండేవారు. బంధాలు, అనుబంధాల మధ్య పిల్లలు పెరిగేవారు. కాలక్రమేణా ఉద్యోగాలు, చదువుల కోసం పెద్ద కుటుంబాలు విడిపోయాయి.

భార్యాభర్తలు, పిల్లలతో కూడిన చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయి. డింక్​ కారణంగా ఇప్పుడు ఆ వ్యవస్థ కూడా కుప్పకూలుతున్నది. ఒకవైపు జనాభా తగ్గుతున్నదని, పిల్లలను కనాలని ప్రభుత్వాలు చెబుతున్నా.. నేటి తరం యువత మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నది. పిల్లల పెంపకం, చదువులు, బాధ్యతల వల్ల తమ వ్యక్తిగత స్వేచ్ఛ దెబ్బతింటుందని భావిస్తున్నది. ‘మా సంపాదన.. మా ఇష్టం’ అంటున్నాయి. డింక్​ కల్చర్​ ఎక్కడ మొదలైంది.. ఇండియాలో ఎందుకు పెరుగుతున్నది.. దీని వల్ల భారత సమాజంపై పడే ప్రభావమేంటి.. వారుసులు లేని డింక్​ కపుల్స్​ని వృద్ధాప్యంలో చూసుకునేదెవరు.. ఇలాంటి సవాళ్లపై కలం 360 డిగ్రీస్ ప్రత్యేక కథనం చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి.

DINK Lifestyle
DINK Lifestyle

Read Also: టోఫు తింటేనే ఆడవారిని గౌరవించినట్లా..? నెట్టింగ్ మరో వింత థీరీ..

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>