కలం, సెంట్రల్ డెస్క్: Telangana Temple Tourism | సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే దైవ దర్శనం కోసమో.. మానసిక ప్రశాంతత కోసమో.. తిరుపతి వేంకటేశ్వరుడిని, శ్రీశైలం మల్లికార్జునుడిని లేదా తమిళనాడులోని అరుణాచలేశ్వరుడిని దర్శించుకుంటాం. వందల కిలోమీటర్లు ప్రయాణించి పొరుగు రాష్ట్రాల్లోని క్షేత్రాలకు వెళ్తుంటాం. మన తెలంగాణలో కూడా భక్తి పారవశ్యానికి, శిల్పకళా వైభవానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అపురూపమైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న మొదలుకొని, ఆధునిక శిల్పకళా అద్భుతం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వరకు.. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప నుంచి కోటి లింగాల వరకు.. ప్రతి అడుగులోనూ జీవకళ ఉట్టిపడేలా తెలంగాణలో ఆలయాలు ఉన్నాయి.
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు.. ఇప్పుడు సరికొత్త హంగులతో పర్యాటక కేంద్రాలుగా మారుతున్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన రామప్ప, భద్రాచలం, అలంపూర్ జోగులాంబ క్షేత్రాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్’ పథకం కింద సుమారు రూ.146 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. ఈ నిధులతో భక్తులకు అవసరమైన వసతి, రవాణా, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నది. అలంపూర్, రామప్ప ఆలయాల్లో పనులు వేగంగా జరుగుతుండగా, ఇటీవల బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని కూడా ఈ జాబితాలో చేర్చడం విశేషం. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణను టూరిజం హబ్‌గా మార్చేందుకు కసరత్తు చేస్తున్నది. కేవలం ఆలయ దర్శనాలే కాకుండా, పర్యాటకులు అక్కడ ఎక్కువ సమయం గడిపేలా సోమశిల, వరంగల్ వంటి ప్రాంతాల్లో ప్రైవేట్ భాగస్వామ్యంతో త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నది. ఆధ్యాత్మికతకు ప్రకృతి అందాలను జోడించి, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. తెలంగాణలోని ఆధ్యాత్మిక కేంద్రాలేంటి? వాటి విశిష్టత ఏంటి? సందర్శనీయ స్థలాలేంటి? సాంస్కృతి సంపద కలిగిన క్షేత్రాలేవీ? వీటన్నింటిపై కలం స్పెషల్ ఎడిషన్ చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: KCRపై కవిత సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
Follow Us On: X(Twitter)

