Mobile Popup Ad
Mobile Popup Ad

సింగీతం స‌రికొత్త ప్ర‌యోగం.. మాట‌లు లేకుండా పాట‌ల‌తో సినిమా!

క‌లం, వెబ్‌డెస్క్‌: లెజెండ‌రీ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీనివాస‌రావు (Singeetam Srinivasa Rao) సిల్వ‌ర్ స్క్రీన్‌పై మ‌రో అద్భుత ప్ర‌యోగానికి శ్రీకారం చుట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు మాట‌లు లేని సినిమాలు చూసిన ప్రేక్ష‌కుల‌కు ఇప్పుడు కేవ‌లం పాట‌ల‌తోనే సినిమా చూసే అద్భుత అనుభూతిని అందించ‌బోతున్నారు. వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై నాగ్ అశ్విన్ నిర్మాత‌గా సింగ్‌-గీత‌మ్ అనే పేరుతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌తి స‌న్నివేశాన్ని, పాత్ర‌ల భావోద్వేగాల‌ను కేవ‌లం పాట‌లు, సంగీతం రూపంలో చూపిస్తూ ఫుల్ క్రియేటివ్‌నెస్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నారు. మూవీ టీం నేడు టైటిల్‌ను అధికారికంగా వెల్ల‌డించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. సినిమాలో న‌టించే న‌టీన‌టుల‌పై ఇంకా స‌స్పెన్స్ నెల‌కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>