శాకంబరీ దేవిగా గద్వాల కన్యకా పరమేశ్వరి అమ్మవారు

కలం, జోగులాంబ గద్వాల: ఆషాడ మాస శుక్రవారం సందర్భంగా గద్వాల (Gadwal) పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు విశేష కుంకుమార్చనలు నిర్వహించారు. ​ఆలయ ఛైర్మన్ ఆలూరు బిలకంటి రాము మాట్లాడుతూ.. అందరినీ సమాన ప్రేమతో ఆదరించేందుకే జగన్మాత శాకంబరీ అవతారం ఎత్తారని.. అమ్మవారి కృపతో అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు. అలంకరణ దాతలుగా పూరి రాధిక-తిరుమలేష్, అల్పాహార దాతలుగా మరిడి సుమలత-శ్రీకాంత్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి నరహరి శ్రీనివాసులు, కోశాధికారి పత్తి రత్నాకర్, సభ్యులు కొండా రాఘవేంద్ర, వజ్రాల రాజేష్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>