Mobile Popup Ad
Mobile Popup Ad

టోఫు తింటేనే ఆడవారిని గౌరవించినట్లా..? నెట్టింగ్ మరో వింత థీరీ..

కలం, వెబ్ డెస్క్ : మీకు టోఫు అంటే ఇష్టమా? ఈ చిన్న ప్రశ్న ఇప్పుడు కేవలం మీ రుచికి సంబంధించింది మాత్రమే కాదు.. మీ మగతనం, అలాగే మహిళల పట్ల మీకున్న గౌరవాన్ని, మీ మొత్తం వ్యక్తిత్వాన్ని కూడా తేల్చేస్తుందని నెట్టింట కొందరు మహిళలు సరికొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్లు మగవారికి టోఫు లేదా సోయా ఉత్పత్తులను ఇచ్చి వారి రియాక్షన్‌ను గమనిస్తున్నారు. టోఫు పట్ల మగవారు చూపే అభిప్రాయం, మహిళల పట్ల వారికున్న ఆలోచనలకు అద్దం పడుతుందని వారు చెబుతున్నారు. టిక్‌టాక్‌లో ఒక వీడియో ఏకంగా 30 లక్షల వ్యూస్ సంపాదించిందంటే ఈ చర్చ (Tofu) ఎంతలా వైరల్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు.

టోఫు పట్ల కొంతమంది పురుషులు చూపించే తీవ్రమైన అసహ్యం వారిలోని ‘ఫ్రాజైల్ మస్క్యులినిటీ’ని (బలహీనమైన మగతనం) సూచిస్తుందని కొందరు వాదిస్తున్నారు. సోయా ఉత్పత్తులు తింటే మగవారిలో ఈస్ట్రోజన్ లెవల్స్ పెరిగి మగతనం తగ్గిపోతుందనే అపోహలే ఈ అసహ్యానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి ఈ వాదనలను సైన్స్ ఎప్పుడో కొట్టిపారేసింది. రచయిత్రి ఎమిలీ కాంటోయిస్ అభిప్రాయం ప్రకారం.. ఆహారానికి, లింగ వివక్షకు పాతకాలం నుండే సంబంధం ఉంది. పూర్వం మాంసాన్ని వేటగాళ్లకు (మగవారికి), మొక్కలను పోషణకు (ఆడవారికి) ముడిపెట్టేవారు. టోఫును ఒక ‘స్త్రీల ఆహారం’గా చూడటం వెనుక ఇలాంటి పాత ఆలోచనలే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అమెరికా వంటి దేశాల్లో రాజకీయ నాయకులు కూడా మాంసాహారాన్ని మగతనంతో ముడిపెట్టి ప్రచారం చేయడం గమనార్హం.

అయితే, ఇవన్నీ కేవలం సోషల్ మీడియా ట్రెండ్స్ మాత్రమేనని డేటింగ్ కోచ్ అమీ చాన్ హెచ్చరిస్తున్నారు. ఒక వ్యక్తికి కేవలం రుచి నచ్చక టోఫును ఇష్టపడకపోవచ్చు. ఒక చిన్న అలవాటును బట్టి ఒకరి మొత్తం వ్యక్తిత్వాన్ని నిర్ణయించడం తప్పని ఆమె సూచించారు. టోఫు (Tofu) తినేవాడు చెడ్డవాడు కావొచ్చు, మాంసం తినేవాడు పర్యావరణ ప్రేమికుడు కావొచ్చు అని అన్నారు.

Read Also: సమ్మర్​‌లో పెరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్‌ కేసులు.. ప్రధాన కారాణాలివే!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>