కలం, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) తీవ్రంగా ఖండించారు. మమత వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఈ విషాద ఘటనపై స్వయంగా శరద్ పవార్ స్పందించి.. ఇది ఒక ప్రమాదమని, ఇందులో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని తెలిపారని ఫడ్నవిస్ గుర్తు చేశారు. మరణాల విషయంలో కూడా ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయడం విచారకరమని అన్నారు.
మహారాష్ట్ర ప్రజలకు అత్యంత ఆప్తుడైన నాయకుడి మరణాన్ని రాజకీయం చేయడం ద్వారా మమతా బెనర్జీ తన స్థాయిని దిగజార్చుకున్నారని ఫడ్నవిస్ (Devendra Fadnavis) విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పూర్తిగా తప్పని, ఒక సీనియర్ నాయకురాలిగా ఆమె హుందాతనాన్ని కాపాడుకోవాలని సూచించారు. రాజకీయాల కోసం ఒక వ్యక్తి మరణాన్ని వాడుకోవడం మహారాష్ట్ర సంస్కృతి కాదని, ఇలాంటి ధోరణిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.


