epaper
Wednesday, January 28, 2026
spot_img
epaper

అన్నంతపనీ చేసిన అమెజాన్​.. భారీగా ఉద్యోగుల తొలగింపు

కలం, వెబ్​డెస్క్​: టెక్​ దిగ్గజం అమెజాన్ (Amazon)​ అన్నంతపనీ చేసింది. గత కొంతకాలంగా ఉద్యోగాల కోత గురించి చెబుతున్న ఈ టెక్​ జెయింట్​ దీనిపై బుధవారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 16వేల మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉద్యోగులకు మెయిల్​ పంపామని, మరో అవకాశం చూసుకునే వరకు వేతనంతో కూడిన మూన్నెళ్ల గడువును ఇస్తున్నామని పేర్కొంది.

మొదట తప్పు మెయిల్​..

యూఎస్​, కెనడా, కోస్టారికా లోని అమెజాన్ (Amazon) ఉద్యోగులకు మంగళవారం సంస్థ నుంచి ఒక మెయిల్​ వెళ్లింది. అందులో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొనడంతోపాటు కారణాలు తెలిపింది. ఈ విషయం బయటకు రావడంతో అమెజాన్​ స్పందించింది. అది, అనుకోకుండా పంపిన మెయిల్​ అంటూ వివరణ ఇచ్చింది. ఆ మెయిల్​ను తొలగించింది. దీంతో ఉద్యోగులు సంతోషించారు. అయితే, వాళ్ల ఆనందాన్ని మరుసటి రోజే ఆవిరి చేసింది.16వేల మందిని తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కంపెనీలోని బ్యూరోక్రసీ వ్యవస్థను తగ్గించడానికి, నిర్ణయం తీసుకోవడంలో వేగాన్ని పెంచడానికి ఈ చర్య తీసుకున్నట్లు అమెజాన్ తెలిపింది.

దీనిపై అమెజాన్​ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​ బేత్​ గాలెట్టీ మాట్లాడారు. ‘ప్రతి నెలలోనూ ఇన్ని ఉద్యోగాలు కోత పెట్టాలనే ప్రణాళిక ఏమీ లేదు. సంస్థ అభివృద్ధికి తీసుకునే నిర్ణయాల్లో ఇదొకటి. గత అక్టోబర్​లో 14వేల మందిని తొలగించాం. ఇప్పుడు కొన్ని విభాగాల్లో మాత్రమే కోత వేశాం’ అని అన్నారు. తొలగింపులకు కచ్చితమైన కారణం చెప్పనప్పటికీ ఏఐ వల్లే ఉద్యోగాల్లో కోత ఉంటుందని గతంలో సంస్థ అత్యున్నత అధికారులు వెల్లడించారు.

ప్రాజెక్ట్​ డాన్​..

ఉద్యోగులకు పంపిన తొలగింపు మెయిల్​లో ‘సెండ్​ ప్రాజెక్ట్​ డాన్​ ఈమెయిల్​’ అనే పేరుతో మెయిల్ పంపారు. ప్రాజెక్ట్​ డాన్ పదాన్ని కోతలకు వాడిన కోడ్​గా భావిస్తున్నారు. అమెజాన్​ వెబ్​ సర్వీసెస్​(AWS) సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​ ఈ డ్రాఫ్ట్​ మెయిల్​ రాశారు. కాగా, అమెజాన్​లో ప్రస్తుతం వివిధ విభాగాల్లో దాదాపు 15లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 3,50,000 మంది కార్పొరేట్​ సెక్టార్​ వాళ్లే. అయితే, ఏ రంగంలో ఎంత మందిని తొలగించారనే విషయాన్ని అమెజాన్​ చెప్పలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>