ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి: భట్టి విక్రమార్క

కలం, వెబ్‌డెస్క్: సంక్షేమ పథకాల అమలులో లోపాలు లేకుండా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా గంభీరావుపేటలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో జిల్లా అభివృద్ధి పనులపై భాగంగా భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాబోయే విద్యా సంవత్సరానికి ముందే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పన, మరమ్మత్తు పనులను ప్రణాళిక బద్దంగా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

సంక్షేమ వసతి గృహాలు, గురుకుల హాస్టళ్లలో డైట్ ఛార్జీలను 40 శాతం పెంచి ప్రతి నెల చెల్లిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల ఆహార నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. అదే విధంగా ధాన్యం సేకరణలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తగిర చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Read Also: నిజామాబాద్‌లో జోరుగా తాటి ముంజల విక్రయాలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>