కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ (TVK Chief Vijay) కు గవర్నర్ అపాయింట్‌మెంట్ ఖరారవడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (Rajendra Arlekar) మధ్యాహ్నం చెన్నైకు చేరుకోనున్నారు. అనంతరం సాయంత్రం సమయంలో టీవీకే చీఫ్ విజయ్ ఆయనను లోక్ భవన్‌లో కలవనున్నారు. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు జాబితాను సమర్పించాలని విజయ్‌కు గవర్నర్ సూచించారు.
దీంతో విజయ్ (TVK Chief Vijay) తనకు అవసరమైన మద్దతు ఉన్నట్లు నిరూపించే జాబితాతో గవర్నర్‌ను కలవడానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరుతూ, బలనిరూపణ కోసం 14 రోజుల గడువు ఇవ్వాలని కూడా ఆయన అభ్యర్థించనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం విజయ్ ప్రమాణ స్వీకారంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఈ సమావేశంతో కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: విజయ్ TVKకు కాంగ్రెస్ మద్దతు.. కానీ ఒక్క షరతు!
Follow Us On : WhatsApp

