కలం, వెబ్ డెస్క్ : భారత రాష్ట్ర సమితి (BRS) సోషల్ మీడియా విభాగం కన్వీనర్ మన్నె క్రిశాంక్ (Manne Krishank)కు న్యాయస్థానంలో ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా రిమాండ్‌లో ఉన్న ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. క్రిశాంక్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు ఆదేశాలతో ఆయన త్వరలోనే జైలు నుంచి విడుదల కానున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసులు పెట్టారని క్రిశాంక్ తరపు న్యాయవాదులు వాదించారు. బెయిల్ లభించడంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Read Also: ఫస్ట్ ఇంప్రెషన్‌ను పాడుచేసే అలవాట్లు ఏంటో తెలుసా?
Follow Us On : WhatsApp

