కలం, సినిమా: భారీ అంచనాల మధ్య నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణం’ సినిమాకు (Ramayana Movie)దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోంది. గ్రాండ్ విజువల్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్‌లు, అత్యున్నత సాంకేతిక విలువలపై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా ఈ సినిమాపై తమ ప్రశంసలు తెలియజేశారు.
చిన్నతనంలో విన్న కథలు ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై ఇంత అద్భుతంగా ప్రాణం పోసుకోవడం ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని మహేష్ బాబు ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణం’లో రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించారు. వారి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా రణ్‌బీర్, యశ్, సాయి పల్లవిల పెర్ఫార్మెన్స్‌ను మహేష్ బాబు ‘మ్యాజికల్’ అంటూ అభివర్ణించారు. ఇంతటి భారీ విజన్‌ను తెరపైకి తీసుకొచ్చిన నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితేశ్ తివారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, వారి కృషికి హ్యాట్సాఫ్ చెప్పారు. ‘రామాయణం’ చిత్ర బృందం మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఈ సినిమాపై తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు. రాముడు, రావణుడి పాత్రల గొప్పతనాన్ని, వారి స్థాయిని బిగ్ స్క్రీన్‌పై అనుభూతి చెందాలంటే తప్పకుండా ‘రామాయణం’ చూడాలని ప్రేక్షకులను కోరారు. రణ్‌బీర్ కపూర్, యశ్ ఇద్దరూ తమ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారని, వారి నటన ప్రతి స్థాయిలో ఆకట్టుకుందని పేర్కొన్నారు. ఇద్దరూ తమ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అద్భుతమైన ఇంపాక్ట్ చూపించారని చెబుతూ.. “ఐ లవ్డ్ ఇట్” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

