కలం, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. భర్త ధన దాహానికి ఓ మహిళా కమాండో (SWAT Commando Murdered) బలైంది. మృతురాలు 4 నెలల గర్భిణి కావడం మరింత విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలోని సోనిపట్‌కు చెందిన అంకుర్, కాజల్ (27) పెద్దలను ఒప్పించి 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఢిల్లీలోని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో అంకుర్ క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. కాజల్.. 2023లో ఢిల్లీ పోలీస్ విభాగంలో ‘స్వాట్’ కమాండోగా ఎంపికైంది. ఈ జంట 2024లో ఢిల్లీకి మకాం మార్చింది.
ఈ క్రమంలో ఈ నెల 22న రాత్రి పది గంటలకు దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో కాజల్ తలను అనేక సార్లు డోర్‌కేసి కొట్టడంతోపాటు డంబెల్‌తో ఆమె తలపై మోదాడు అంకుర్. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను సమీపంలోని గజియాబాద్ హాస్పిటల్లో చేర్పించాడు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. పోస్ట్‌మార్టమ్‌లో కాజల్ తలకు బలమైన గాయాలున్నట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేయగా, అంకుర్ ఇంట్లో డోర్, డంబెల్పై రక్తపు మరకలు కనిపించాయి. నిందితుడు కాజల్‌ను డోర్‌కేసి బాది, తలను డంబెల్‌తో మోది చంపినట్లు గుర్తించారు. అనంతరం నిందితుని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, పెళ్లైన 15 రోజుల నుంచే కారు, అదనపు కట్నం కోసం తమ కుమార్తెను అల్లుడు వేధించేవాడని కాజల్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాజల్‌ను హాస్పిటల్లో చేర్పించిన తర్వాత తమకు కాల్ చేసి, మీ కూతురిని చంపేశానని (SWAT Commando Murdered) చెప్పినట్లు వాళ్లు విలపిస్తూ వెల్లడించారు. కాజల్ ప్రస్తుతం గర్భిణి అని, తల్లీబిడ్డలను చంపిన అంకుర్‌ను కఠినంగా శిక్షించాలని వాళ్లు డిమాండ్ చేశారు.
Read Also: ప్రేమ పెళ్లికి అడ్డొస్తున్నారని తల్లిదండ్రుల్ని చంపిన కూతురు!
Follow Us On: Instagram


