ఢిల్లీ పోలీస్‌శాఖ సంచలన నిర్ణయం.. మోడీ పిలుపు ఎఫెక్ట్

కలం, వెబ్ డెస్క్: అంతర్జాతీయ పరిస్థితులు, ప్రధాని మోదీ ఇటీవల ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఢిల్లీ పోలీస్‌శాఖ (Delhi Police) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో అనవసర వాహన వినియోగాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం ఢిల్లీ పోలీస్ కమిషనర్ కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ వాహనాల వినియోగాన్ని తార్కికీకరించడం, ఇంధన వినియోగాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి.

కార్యాలయాలకు మార్గదర్శకాలు జారీ

అన్ని యూనిట్లు, కార్యాలయాలు వెంటనే ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేశారు. అవసరం లేని వాహన ప్రయాణాలను తగ్గించుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న వాహనాలను సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. పోలీస్‌శాఖ దేశవ్యాప్తంగా ఇంధన సంరక్షణకు, అనవసర ఖర్చుల తగ్గింపుకు తన వంతు సహకారం అందించాలని సూచించారు. డాక్ మోటార్‌సైకిళ్లు, టూ వీలర్లు కేవలం అత్యవసర అధికారిక పనులకు మాత్రమే వినియోగించాలని పేర్కొన్నారు. ఒకే పోలీస్ స్టేషన్ లేదా యూనిట్ నుంచి ఒకే కోర్టు, కార్యాలయం లేదా గమ్యస్థానానికి వెళ్లే అధికారులు, సిబ్బంది ఒకే వాహనంలో ప్రయాణించేలా చూసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

సమావేశాలు వర్చ్‌వల్‌గా నిర్వహించుకోవాలి

సాధారణ సమావేశాలు, సమీక్షలు, సమన్వయ సమావేశాలను సాధ్యమైనంతవరకు వీడియో కాన్ఫరెన్స్ లేదా వర్చువల్ విధానంలో నిర్వహించుకోవాలని సూచించారు. దీని ద్వారా అనవసర ప్రయాణాలు తగ్గుతాయని పేర్కొన్నారు. మెట్రో రైలు, ప్రజా రవాణా సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో విధులు నిర్వహించే సిబ్బంది సాధ్యమైనప్పుడు వాటిని ఉపయోగించాలని ప్రోత్సహించాలని ఆదేశించారు. ప్రత్యేకంగా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ పరిధిలో ఈ విధానం అమలు చేయనున్నారు.

వాహనాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి

వాహనాల నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని, టైర్ల గాలి పీడనం, ఇంజిన్ ట్యూనింగ్, సర్వీసింగ్ వంటి అంశాలను సమయానికి నిర్వహించాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్య నిర్వహణ కారణంగా ఇంధనం వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీఐపీ, వీవీఐపీ కాన్వాయ్‌లలో అవసరమైనంత మాత్రమే వాహనాలు వినియోగించాలని, భద్రతకు భంగం కలగకుండా మిగతా వాహనాల సంఖ్యను తగ్గించాలని ఆదేశించారు. డిస్ట్రిక్ట్ డీసీపీలు, యూనిట్ హెడ్స్ ఇంధన వినియోగం, లాగ్‌బుక్స్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలని, అసాధారణ వినియోగం కనిపిస్తే వెంటనే సమీక్షించాలని సూచించారు. ఈ చర్యల ద్వారా దేశవ్యాప్తంగా ఇంధన సంరక్షణకు, ప్రభుత్వ వ్యయ నియంత్రణకు పోలీస్‌శాఖ కూడా కీలక పాత్ర పోషించనున్నట్లు ఢిల్లీ పోలీసులు (Delhi Police) స్పష్టం చేశారు.

Read Also: ఇంధన పొదుపు చర్యలు.. వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>