కలం, వెబ్ డెస్క్: తమిళనాడు రాజకీయాలు, సినిమా పరిశ్రమకు సంబంధించిన తాజా పరిణామాలపై ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సీఎం విజయ్ (CM Vijay) తీసుకున్న నిర్ణయాలపై ఆయన ఎక్స్ వేదికగా మద్దతు ప్రకటిస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. సీఎం విజయ్ రాజ్ మోహన్‌ను సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని ఎంతో ఆలోచించి, పరిశీలించిన తర్వాతే తీసుకుని ఉంటారన్నారు. కాబట్టి దీనిపై తొందరపడి, ఆవేశంగా స్పందించడం కంటే.. కొంత సమయం ఇచ్చి సపోర్ట్ ఇద్దామని చెప్పారు. ఫిల్మ్ ఇండస్ట్రీ సంక్షేమం కోసం నూతన మంత్రి రాజ్‌మోహన్ తన వంతుగా అత్యుత్తమ సేవలు అందిస్తారని తాను ఆశిస్తున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుత తరుణంలో తమిళ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యల పట్ల అందరిలో ఉన్న ఆందోళనలను తాను అర్థం చేసుకోగలనని లారెన్స్ (Raghava Lawrence) ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, ఫిలిం టెక్నాలజీ సినిమాటోగ్రాఫ్ చట్టాల నూతన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజ్‌మోహన్‌కు ఈ కొత్త బాధ్యతలలో స్థిరపడటానికి కొంత సమయం, సరైన అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు టీవీకే పార్టీ అధికారిక హ్యాండిల్‌తో పాటు మంత్రి రాజ్‌మోహన్‌ను ట్యాగ్ చేస్తూ లారెన్స్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు నటుడు విశాల్ రాజ్‌మోహన్ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
Read Also: రేపే సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణస్వీకారం.. మంత్రుల లిస్ట్ ఇదే
Follow Us On: Sharechat

