epaper
Friday, January 30, 2026
spot_img
epaper

‘మున్సిపోల్స్’కు స్క్రీనింగ్ కమిటీ.. మంత్రులందరికీ పార్లమెంటు సెగ్మెంట్లు

కలం, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల (municipal elections)ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక్కో మంత్రి, సలహాదారులను చైర్‌పర్సన్‌లుగా నియమిస్తూ స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. గతంలో ప్రతీ పార్లమెంటు సెగ్మెంట్‌కు ఒక మంత్రిని ఇన్‌చార్జిగా నియమించగా ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. దీనికి తోడు స్టార్ క్యాంపెయినర్ల పేరుతో యాక్టివిటీని ముమ్మరం చేసింది. ప్రతీ స్క్రీనింగ్ కమిటీ చైర్‌పర్సన్‌కు సహాయకంగా ఇద్దరి చొప్పున కన్వీనర్లను నియమిస్తూ పీసీసీ ఆదేశాలు జారీ చేసింది.

స్క్రీనింగ్ కమిటీల్లో జిల్లాల్లోని డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్‌‌పర్సన్లు స్పెషల్ ఇన్వైటీలుగా ఉంటారని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకోవడం, దానికి అవసరమైన ప్రచార కార్యక్రమాన్ని సమన్వయం చేసుకోవడం, ప్రజల్లోకి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి అంశాలను తీసుకెళ్ళడం.. తదితరాలన్నీ స్క్రీనింగ్ కమిటీలు చూసుకుంటాయి.

పీసీసీ ప్రకటించిన ఎంపీ సెగ్మెంట్ల స్క్రీనింగ్ కమిటీ చైర్‌పర్సన్లు
ఆదిలాబాద్ : సుదర్శన్‌రెడ్డి (సలహాదారు)
పెద్దపల్లి : జూపల్లి కృష్ణారావు (మంత్రి)
కరీంనగర్ : తుమ్మల నాగేశ్వరరావు
నిజామాబాద్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి
జహీరాబాద్ : అజారుద్దీన్
మెదక్ : వివేక్
మల్కాజిగిరి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
చేవెళ్ళ : శ్రీధర్‌బాబు
మహబూబ్‌నగర్ : దామోదర రాజనర్సింహ
నాగర్‌కర్నూల్ : వాకిటి శ్రీహరి
నల్లగొండ : అడ్లూరి లక్ష్మణ్
భువనగిరి : సీతక్క
వరంగల్ : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మహబూబాబాద్ : పొన్నం ప్రభాకర్
ఖమ్మం : కొండా సురేఖ

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>