మెదక్‌లో అక్రమ గృహ ఎల్పీజీ సిలిండర్ల స్వాధీనం

కలం మెదక్ బ్యూరో : మెదక్(Medak) జిల్లా కేంద్రంలో అక్రమంగా గృహ ఎల్పీజీ(Domestic LPG) సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న వారిపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. పట్టణంలోని వివిధ హోటళ్లు, టీ పాయింట్లలో తనిఖీలు నిర్వహించి మొత్తం 52 గృహ ఎల్పీజీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ సప్లైస్ అధికారులు, తహసీల్దార్లు సభ్యులుగా మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పట్టణవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా గృహ సిలిండర్లను వాణిజ్యంగా వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద్ మాట్లాడుతూ, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం 1955 (Essential Commodities Act 1955) లోని సెక్షన్ 6-A కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెదక్ జిల్లాలో గృహ ఎల్పీజీ సిలిండర్ల దుర్వినియోగం, మళ్లింపు, బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలను గమనించిన ప్రజలు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>