కోమటిరెడ్డిని కేబినెట్ నుంచి తప్పించాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

కలం, వెబ్ డెస్క్ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని వెంటనే కేబినెట్ నుంచి తప్పించాలని బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ (jajula Srinivas Goud) డిమాండ్ చేశారు. బీసీలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్లపై శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కావాలనే బీసీలను ఎదగనీయకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటూ తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. జగ్గారెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేయాలని.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి నేతృత్వంలో పార్టీ 100 సీట్లు గెలుస్తుందని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి.

అయితే బీసీ నేతకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని కోమటిరెడ్డి ఓర్వలేకపోతున్నారని.. కనీసం బీసీలకు డీసీసీ పదవులు ఇచ్చినా తట్టుకోలేకపోతున్నారంటూ జాజుల శ్రీనివాస్ గౌడ్ (jajula Srinivas Goud) మండిపడ్డారు. జగ్గారెడ్డికి పీపీసీ ఇవ్వాలని చెప్పడం బీసీలను అవమానించడమే అని.. మంత్రి పదవికి కోమటిరెడ్డి అనర్హుడని జాజుల ఫైర్ అయ్యారు. ఇలాంటి వారు ఎన్నటికైనా బీసీల వ్యతిరేకులుగా ఉంటారని.. అగ్రకులాలకు పదవులు ఇప్పించడానికే ప్రయత్నిస్తున్నారని జాజుల చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>