Mobile Popup Ad
Mobile Popup Ad

మమ్మల్నే తట్టుకోవట్లేదు.. ఇక కేసీఆర్ ఎందుకు?: KTR

కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌ రెడ్డి తప్పు చేసినందున పార్టీ చర్యలు తీసుకుందని అన్నారు. రోహిత్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చామని… తాత్కాలికంగా సస్పెండ్ చేశామన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డికి కాంగ్రెస్‌లో అసంతృప్తి ఉన్నట్లుందని అభిప్రాయపడ్డారు. జీవన్‌రెడ్డి విషయంలో తమ పార్టీ ఎలాంటి చర్చలు చేయలేదన్నారు.

అన్ని టెస్టులకు తాను సిద్ధమని చెప్పానని… మరి ఏమైందో అంటూ వ్యాఖ్యానించారు. ఎప్పుడు ఎక్కడకు రావాలో తమ అధినేత కేసీఆర్‌కు తెలుసని కేటీఆర్ (KTR) చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్నే తట్టుకోవట్లేదు.. ఇక వారికి కేసీఆర్ ఎందుకు? అంటూ సెటైరికల్ కామెంట్ చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారి.. ఆ పార్టీ తరఫున పోటీ చేసినా కాంగ్రెస్ పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. నిషేధిత భూములపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎందుకు నోరు మెదపట్లేదు? అని ప్రశ్నించారు. కోటి ఎకరాలు నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>