టార్గెట్ దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌.. భారీ మిసైల్‌ను ప్ర‌యోగించిన ఇరాన్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: ఇరాన్‌, ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకూ మ‌రింత ముదురుతోంది. 16 రోజులు గ‌డిచినా త‌గ్గేదే లేదు అన్న‌ట్లుగా ఇరు దేశాలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఇరాన్ (Iran) దాడులు మ‌రింత తీవ్ర‌త‌రం చేసింది. ఎయిర్‌పోర్టులే టార్గెట్‌గా దాడులు చేస్తోంది. ముఖ్యంగా దుబాయ్ (Dubai), బాగ్దాద్ ఎయిర్‌పోర్ట్‌ల‌పై భారీ డ్రోన్, మిస్సైల్ దాడులు చేప‌ట్టింది. మిడిల్ ఈస్ట్ వార్‌లో మొదటిసారి సెజ్జిల్ అనే భారీ మిసైల్‌ (Sejjil Missile)ను ఇరాన్ ప్ర‌యోగించింది. సెజ్జిల్ అనేది స్వదేశీయంగా రూపొందించి, అభివృద్ధి చేసిన ఘన ఇంధనంతో పని చేసే రెండు దశల బాలిస్టిక్ మిసైల్‌.

సెజ్జిల్‌ దాదాపు 700 కిలోల పేలోడ్‌ల సామర్థ్యం కలిగి ఉంటుంది. సుమారు 2,000 కి.మీ పరిధిలోని లక్ష్యాలను సునాయాసంగా చేరుకోగ‌ల‌దు. దీనికి అధిక ఎత్తులో విన్యాసాలు నిర్వహించే సామర్థ్యం వల్ల ‘డ్యాన్సింగ్ క్షిపణి’ అనే పేరు కూడా ఉంది. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) ప్రకారం సెజ్జిల్‌ దాదాపు 18 మీటర్ల పొడవు, దాదాపు 1.25 మీటర్ల వ్యాసం ఉంటుంది. దీని బరువు దాదాపు 23,600 కిలోల వ‌ర‌కు ఉండ‌వ‌చ్చు.

ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ సిటీ వేదికగా ఇరాన్‌ భీకర దాడులు జరుపుతున్న‌ది. ఇరాన్ (Iran) దాడులకు ప్రతీకారంగా అమెరికా, ఇజ్రాయెల్ ద‌ళాలు దాడులు పెంచుతున్నాయి. ప్రధానంగా ఇరాన్‌లోని కీలకమైన ఖార్గ్ ద్వీపంపై అమెరికా దళాలు అత్యంత శక్తివంతమైన వైమానిక దాడులు చేప‌ట్టాయి. దాడులు, ప్రతిదాడులతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి.

Read Also: ఆకాశంలో అద్భుతం.. 104 మంది స్కైడైవ‌ర్ల ప్ర‌పంచ రికార్డ్‌!

Follow Us On: Youtube

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>