క‌న్నుల పండుగ‌గా ఆస్కార్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం!

క‌లం, వెబ్ డెస్క్‌: ప్ర‌పంచ సినీ రంగంలో అత్యున్న‌త పుర‌స్కార‌మైన ఆస్కార్ ప్రదానోత్సవ వేడుక‌లు (Oscar Awards) క‌న్నుల పండువ‌గా జ‌రుగుతున్నాయి. లాస్‌ ఏంజెలెస్‌ (Los Angeles)లోని డాల్బీ థియేటర్ వేదికగా 98వ ఆస్కార్ అవార్డుల (98th Oscar Awards) ప్రదానోత్స‌వాన్ని నిర్వ‌హిస్తున్నారు. ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’, ‘సిన్నర్స్’ సినిమాలు భారీగా అవార్డులు ద‌క్కించుకుంటున్నాయి. సిన్న‌ర్స్ మూవీలో యాక్టింగ్‌కు గానూ మైఖేల్ బీ జోర్డాన్ ఉత్త‌మ న‌టుడిగా ఎంపిక‌య్యారు. ఇక హామ్నెట్ మూవీలో అల‌రించిన జెస్సీ బ‌క్లీకి ఉత్త‌మ న‌టి అవార్డు ద‌క్కింది. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమాలో న‌ట‌న‌కు గానూ సీన్ పెన్ ఉత్త‌మ స‌హాయ‌ న‌టుడిగా అవార్డు ద‌క్కించుకున్నారు. వెప‌న్స్‌లో త‌న అద్వితీయ ప్ర‌తిభ‌తో ఆకట్టుకున్న ఎమీ మాడిగ‌న్ ఉత్త‌మ స‌హాయ న‌టిగా అవార్డు గెలుచుకున్నారు.

ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో భారతీయ నటి, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా (priyanka chopra) పాల్గొన్నారు. తన భర్త నిక్ జోనాస్ తో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. ఓ విజేతకు ప్రియాంకా చోప్రా అవార్డు ప్రదానం చేశారు. గతంలో సైతం ప్రియాంకా ఆస్కార్ వేడుకల్లో ప్రజెంటర్ గా పాల్గొన్నారు.

మ‌రిన్ని అవార్డులు ద‌క్కించుకున్న‌ది వీళ్లే…

ఉత్త‌మ ద‌ర్శ‌కుడు: పాల్ థామ‌స్ అండ‌ర్స‌న్

ఉత్తమ సినిమాటోగ్రఫీ: సిన్నర్స్

ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: సిన్నర్స్‌

ఉత్త‌మ ఒరిజిన‌ల్ స్కోర్: స్కిన్న‌ర్స్

ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: కెపాస్‌ డెమన్‌ హంట్స్‌

ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ది గర్ల్‌ హు క్రైడ్‌ పెరల్స్‌

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: ఫ్రాంకిన్‌ స్టన్‌

ఉత్తమ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌: ఫ్రాంకిన్‌ స్టన్‌

ఉత్తమ క్యాస్టింగ్‌: వన్‌ బ్యాటిల్‌ ఆప్టర్‌ అనదర్‌

ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ది సింగర్స్‌, టూ పీపుల్‌ ఎక్ఛ్సేంజ్‌ సలైవా

ఉత్తమ స్క్రీన్‌ప్లే : ర్యాన్‌ కూగ్లర్‌

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌: మిస్టర్‌. నోబడీ ఎగనెస్ట్‌ పుతిన్‌

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌: ఆల్‌ ది ఎంప్టీ రూమ్స్‌

ఉత్త‌మ విజువ‌ల్ ఎఫెక్ట్: అవ‌తార్ ఫైర్ అండ్ యాష్

ఉత్త‌మ ఒరిజిన‌ల్ సాంగ్: గోల్డెన్

ఇంట‌ర్నేష‌న‌ల్ ఫీచ‌ర్ ఫిల్మ్: సెంటిమెంట‌ల్ వాల్యూ

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>