epaper
Wednesday, January 21, 2026
spot_img
epaper

తెలంగాణ నెక్ట్స్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీని ఆవిష్కరించిన సీఎం రేవంత్​

కలం వెబ్ డెస్క్ : దావోస్(Davos) వేదికగా జ‌రుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో తెలంగాణ(Telangana) ప్రభుత్వం నెక్ట్స్‌జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆవిష్కరించారు. ఈ పాలసీ ద్వారా తెలంగాణను 2030 నాటికి ప్రపంచంలోని టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్‌లలో ఒకటిగా నిలబెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈఓ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.

కొత్త పాలసీ ప్రకారం వచ్చే ఐదేళ్లలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. భారీ తయారీతో పాటు హైఎండ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ఆధునిక బయోలాజిక్స్, సెల్ అండ్‌ జీన్ థెరపీ, ఎంఆర్ఎన్ఏ, ఏఐ ఆధారిత హెల్త్‌కేర్, బయో మాన్యుఫ్యాక్చరింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఈ పాలసీలో భాగంగా గ్రీన్ ఫార్మా సిటీ, 10 ఫార్మా విలేజీలు, జీనోమ్ వ్యాలీ విస్తరణ, మెడికల్ డివైసెస్ పార్క్ అభివృద్ధి చేపట్టనున్నారు. అలాగే దేశంలోనే తొలిసారిగా వ‌న్ బ‌యో గ్రోత్ ఫేజ్ సెంటర్, లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ ఫండ్ (భవిష్యత్తులో రూ.1,000 కోట్ల వరకు) ఏర్పాటు చేయనున్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రపంచ ఆరోగ్య రంగంపై ప్రభావం చూపేలా బలమైన బయోసైన్స్ వ్యవస్థను నిర్మిస్తున్నామన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. గత రెండేళ్లలో రూ.73 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, కొత్త పాలసీతో వచ్చే ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ పాలసీ అమలుతో హైదరాబాద్ ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్, ఇన్నోవేషన్ హబ్‌గా మరింత బలపడనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>