కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి ఢిల్లీకి వెళ్లబోతున్నారు. రేపు (శుక్రవారం) ఆయన సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అసంతృప్తులకు పదవులు ఇచ్చే విషయంపై అధిష్ఠానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నేతలు పదవులు ఆశించి భంగపడ్డారు. వారిని అధిష్ఠానం బుజ్జగిస్తూ వస్తోంది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం మంత్రి పదవిని ఆశించారు. ఒక దశలో ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు బాలూ నాయక్, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, రామ్మోహన్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం తీవ్ర ఆశలు పెట్టుకొని భంగపడ్డారు. సామాజికసమీకరణాలు, జిల్లాల లెక్కలు వంటి కారణాలతో వారికి మంత్రి పదవులు దక్కలేదు. దీంతో వారు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి నేతలకు క్యాబినెట్ కు సమానమైన పదవులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఆ విషయంపైనే సీఎం చర్చ
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధిష్ఠానం దగ్గర అసంతృప్తులకు పదవులు ఇచ్చే ప్రతిపాదన ఉంచబోతున్నట్టు సమాచారం. రేపు జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశంలోనూ ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో పాటు చట్ట సవరణతో కొత్తగా వచ్చిన నిబంధనలపై చర్చ జరగబోతున్నది. భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా కాంగ్రెస్ పెద్దలు చర్చించబోతున్నారు. ఎల్లుండి కాంగ్రెస్ అగ్ర నేతలతో భేటీ కానున్న సీఎం రేవంత్ సమావేశం కాబోతున్నారు. అదే రోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా జరగనున్నది. ఈ నెల 29న అసెంబ్లీ సెషన్ జరగనున్నందున 28 రాత్రికి ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనం కానున్నారు. మరి సీఎం ప్రతిపాదనలకు అధిష్ఠానం ఓకే చెప్తుందా? అసంతృప్త నేతలకు పదవులు రాబోతున్నాయా? ఏయే నేతకు ఏ పదవి రాబోతున్నది. అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also: వామ్మో వెండి… ఇప్పుడే కొనేయండి!
Follow Us On: Pinterest


