కలం, వెబ్ డెస్క్: అస్తవ్యస్త జీవనశైలి, అధిక ఒత్తిడి కారణంగా 40 ఏండ్లు దాటినవారిలో గుండెపోటు (Heart Attacks) సమస్యలొస్తున్నాయి. ఒకప్పుడు వృద్ధులు గుండెపోటు బారిన పడేవారు. కానీ ప్రస్తుతం జీవనశైలి మార్పుల కారణంగా 30 నుంచి 40 ఏళ్లు వారు కూడా ప్రమాదాల బారిన పడుతున్నారు. సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి లాంటి లక్షణాలు ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే గుండెపోటు నుంచి బయటపడొచ్చు. అందుకోసం ఏం చేయాలంటే..
గుండెపోటు (Heart Attacks) రాకుండా ఏం చేయాలి..!
భోజనం తర్వాత వాకింగ్: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భోజనం తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల గుండెను జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. భోజనం చేసిన తర్వాత నడిస్తే (Walking) రక్తంలో చక్కెర, రక్తపోటు, బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. అందుకే పది నిమిషాలు అయినా వాకింగ్ చేయాలి.
ఫైబర్ తినండి: 40 దాటిన తర్వాత ఎక్కువ ఫైబర్ తీసుకోవడం ఉత్తమం. ఫైబర్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఓట్స్, బీన్స్, ఆపిల్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
మంచి నిద్ర: మంచి నిద్ర (Sleep) కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ కనీసం 7 నుండి 8 గంటలు నిరంతరాయంగా నిద్రపోవాలి. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలు పెరగకుండా చూస్తాయి. అలాగే ప్లాస్టిక్ వాడకం తగ్గించడం, ఆరోగ్య పరీక్షలు చేయడం ద్వారా గుండెను రక్షించవచ్చు.
Read Also: పొల్యూషన్ నుంచి ప్రొటెక్షన్ ఎలా?
Follow Us On: Instagram


