కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం (Vizianagaram)లో ఓ హోంగార్డు (Home Guard) ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు (ACB Raids) నిర్వహిస్తున్నారు. విజయనగరం, గుర్ల, విశాఖలో హోం గార్డు శ్రీనివాస్ రావుకు చెందిన ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం శ్రీనివాస్ విజయనగరం ఎస్పీ ఆఫీస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. శ్రీనివాస్ సుమారు 15 ఏళ్ల పాటు ఏసీబీలో కూడా పని చేశాడు. ఏడాది క్రితం జిల్లా పోలీస్ కార్యాలయానికి సరెండర్ అయ్యాడు. శ్రీనివాస్‌పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీలో పని చేసి అవినీతి చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: సోషల్ మీడియా నియంత్రణపై.. లోకేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
Follow Us On: Instagram


