కలం, డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అమెరికా పర్యటనలో చివరి రోజు హార్వర్డ్ స్కూల్స్, ఎంఐటీ, కొలంబియా, అలుమ్ని లాంటి యూనివర్సిటీల స్టూడెంట్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. నాయకత్వం, సక్సెస్ సీక్రెట్స్, ఆర్థిక అభివృద్ధి, భవిష్యత్ ప్లానింగ్ మీద సీఎం రేవంత్ సందేశం ఇచ్చారు. అన్ని వర్గాల సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. భారత్ ఆర్థిక అభివృద్ధిలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ భేటీలో నాయకత్వం, రైతులు-మహిళలు, పర్యావరణ పరిరక్షణ, సస్టైనబిలిటీ మీద సీఎం రేవంత్ విద్యార్థులతో చర్చలు జరిపారు. విద్యార్థులు వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
తెలంగాణ రైజింగ్ 2047 విజన్, లక్ష్యాలపై సీఎం రేవంత్ వివరించారు. విద్యార్థులకు నాయకత్వం నేర్పాలంటే హార్వర్డ్ (Harvard University) ప్రొఫెసర్లే ఉత్తములు అని సీఎం సరదాగా వ్యాఖ్యానించారు. విద్యార్థులు తెలంగాణ రైజింగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy). తాను ఇంపోర్ట్ ప్రొఫెసర్ ను కాదని.. విద్యార్థులు పరస్పర చర్చలతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
Read Also: ఫిబ్రవరి 4న మిర్యాలగూడకు సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Sharechat


