భద్రాద్రి సీతారాముల కళ్యాణం.. సీఎం రేవంత్‌కు ఆహ్వానం

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి(Sri Sita Ramachandra Swamy) వారి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)కి ఆహ్వానం అందింది. భద్రాచల సీతారామచంద్రస్వామి ఆలయం తరఫున ముఖ్యమంత్రికి దేవాయశాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఈవో ఆహ్వానం అందించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. నేటి నుంచి భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఇవాళ ఉగాది సందర్భంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈనెల 27న శ్రీరామనవమి సందర్భంగా మిథిలా మండపంలో సీతారామ కల్యాణోత్సవం ఘనంగా జరుగనుంది. ఏప్రిల్‌ 2 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామికి పరాభవ నమ ఉగాది సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాచలంలో ఉదయం నుంచి భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేస్తున్నారు. పర్వదినం సందర్భంగా భద్రాచలానికి భక్తులు పోటెత్తారు. కిక్కిరిసిన భక్తుల నామ స్మరణతో భద్రాద్రి వీధులు మారుమ్రోగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, ధర్మపురి, కొండగట్టు, యాదగిరి గుట్ట, స్వర్ణగిరి దేవాలయం, ఛాయా సోమేశ్వర ఆలయం, జోగులాంబ దేవాలయం, వేయిస్తంభాల గుడి, వరంగల్ భద్రకాళి దేవస్థానాల్లో ఘనంగా ఉగాది వేడుకలు ఘనంగా సాగుతున్నాయి.

అటు ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది ఆస్థానం ఘనంగా జరిగింది. ఆలయంలో బంగారు వాకిలి చెంతకు సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి భక్తులకు కనువిందు చేయనున్నారు. మరో పల్లకిపై శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడు విష్వక్సేనుల వేంచేపు చేశారు. ఉత్సవమూర్తులకు నివేదనలు, పూజల తర్వాత నూతన వస్త్రాలను వేద పండితులు సమర్పణ చేశారు. అనంతరం ఆలయ సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేయనున్నారు.

Read Also: గుడ్ న్యూస్.. రేపు సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>