కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)హార్వర్డ్ కెన్నెడీ స్కూల్(Harvard Kennedy School)లో నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఆయనతో పాటు మొత్తం 62 మంది ఈ శిక్షణలో పాల్గొన్నారు. “లీడర్‌షిప్ ఇన్ ద 21వ సెంచరీ” అనే పేరుతో ఈ కోర్సు నిర్వహించారు. జనవరి 25 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. శిక్షణ జరిగిన ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. మైనస్ 15 నుంచి మైనస్ 24 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇంతటి తీవ్రమైన చలిలో కూడా శిక్షణ సాగడం గమనార్హం. ఈ రోజు శిక్షణ విజయవంతంగా పూర్తి కావడంతో హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ అధ్యాపకులు శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా నాయకత్వ లక్షణాలు, ఆధునిక పాలన విధానాలపై అందరికీ అవగాహన పెరిగిందని నిర్వాహకులు తెలిపారు.


