కలం, వెబ్ డెస్క్ : నేడు (జనవరి 26) ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ప్రతి గణతంత్ర దినోత్సవం గర్వంగా గుర్తుండిపోతుంది. కానీ.. ఈ ఏడాది ఆ గర్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానం దక్కింది.
ప్రజా రాజధాని అమరావతిలో మొదటిసారిగా త్రివర్ణ పతాకం ఆవిష్కృతమయింది. ఇది చరిత్రలో నిలిచిపోయే క్షణం. ఈ ఘట్టంలో ప్రభుత్వ దిశా నిర్దేశాన్ని, విజన్‌ను స్పష్టంగా వివరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) కు చంద్రబాబు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ పట్ల మన దృక్పథాన్ని ప్రతిబింబించే ఒక అద్భుతమైన కవాతును, అందంగా రూపొందించిన శకటాలను చూడటం ఒక ఆనందకరమైన అనుభవం అని చంద్రబాబు (Chandrababu) ట్వీట్ చేశారు.
Read Also: దేవర 2కి టైమ్ ఫిక్స్ అయ్యిందా..?
Follow Us On: Instagram


