epaper
Friday, January 30, 2026
spot_img
epaper

సమాజసేవకు విరాళాలు ఇవ్వాలి : సీఎం చంద్రబాబు

కలం, డెస్క్ : ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని.. సమాజసేవకు సంపాదనలో కొంత కేటాయించాలని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో మాతాశిశు సంరక్షణ కేంద్రం కొత్త బిల్డింగ్ ను సీఎం చంద్రబాబు (Chandrababu) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సమాజం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. ఈ బిల్డింగ్ కోసం పూర్వ విద్యార్థులు రూ.100 కోట్ల విరాళం ఇచ్చారు. ఇలాంటి వారు ముందుకు వస్తే కచ్చితంగా సమాజంలో ఎన్నో పనులు జరుగుతాయి. మన సంపాదనలో కొంత భాగం సమాజానికి కేటాయిస్తే ఈ దేశం అద్భుతంగా తయారవుతుంది. ఎన్నో సేవలు అడ్డంకి లేకుండా జరుగుతాయి’ అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

ప్రతి ఒక్కరూ ముందు చూపుతోనే భవిష్యత్ ను తీర్చిదిద్దుకోవాలని.. అందుకు చదవు మూల స్తంభం లాంటిదని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆ విషయంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అందరికీ ఆదర్శంగా ఉంటారని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, నరేంద్ర కుమార్, రామాంజనేయులు, స్థానికులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>