కలం, సినిమా : మెగాస్టార్ చిరంజీవి హీరోగా తన కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నారు. మెగా 158 (Mega 158)గా పిలుస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా కూతురు సెంటిమెంట్ నేపథ్యంగా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కీలకమైన కూతురు క్యారెక్టర్ కు యంగ్ హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) ని తీసుకున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఉప్పెన బ్యూటీకి మెగాస్టార్ కు కూతురిగా నటించే అరుదైన అవకాశం దక్కిందని అంతా అనుకున్నారు.
అయితే నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇదంతా రూమర్ అని వెల్లడించింది. Krithi Shetty కూతురు పాత్రలో నటిస్తుందనేది నిజం కాదని తెలిపింది. మెగా 158లో నటించే నటీనటుల వివరాలను తామే అఫీషియల్ గా వెల్లడిస్తామని మేకర్స్ చెబుతున్నారు. ఇటీవల ఛాంపియన్ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ అనస్వర రాజన్ పేరు కూడా Mega 158 లో కూతురు పాత్ర కోసం వినిపిస్తోంది.
మెగాభిమానులు కోరుకునే యాక్షన్ తో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ రూపొందించనున్నారు. వచ్చే నెలలో ఫార్మల్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని, మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పాల్గొంటున్నారు. మెగాస్టార్ దావోస్ పర్యటన ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.


