కలం మెదక్ బ్యూరో: హైదరాబాద్ పారిశుద్ధ్య కార్మికుల పిల్లల భవిష్యత్తు కోసం జీహెచ్ఎంసీ మంచి కార్యక్రమం చేపట్టింది. ‘ఎక్స్‌పోజర్ విజిట్’ పేరుతో దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన ఐఐటీ హైదరాబాద్‌కు పిల్లలను తీసుకెళ్లింది. ప్రతి సర్కిల్ నుంచి ముగ్గురు చొప్పున దాదాపు 180 మందిని బస్సుల్లో సంగారెడ్డి (Sangareddy) శివారులోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌కు తీసుకెళ్లింది. ఈ విజిట్‌లో భాగంగా ఐఐటీ అధ్యాపకులు విద్యార్థులతో మాట్లాడారు.
లైబ్రరీ, ఇన్నోవేషన్ సెంటర్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనితీరు గురించి వివరించారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపేలా జీహెచ్ఎంసీ (GHMC) తీసుకున్న ఈ కార్యక్రమాన్ని పలువురు అభినందించారు. ప్రపంచస్థాయి విద్యా ప్రమాణాలు, క్యాంపస్ వాతావరణాన్ని పరిచయం చేయడంతోపాటు.. ఉన్నత చదువులు చదవడానికి ఈ విజిట్ ప్రేరణగా నిలువనుంది.


