Mobile Popup Ad
Mobile Popup Ad

మంగ్లీ సాంగ్ వివాదం.. జాతీయ‌ మ‌హిళా క‌మిష‌న్ సీరియ‌స్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ సింగ‌ర్ మంగ్లీ పాడిన ఓ పాట తీవ్ర వివాదాస్ప‌దంగా మారింది. బాలీవుడ్ స్టార్స్ సంజ‌య్ ద‌త్‌, నోరా ఫ‌తేహీ న‌టించిన ఓ సినిమాలో మంగ్లీ తాజాగా ఓ పాట పాడారు. “సర్కే చునర్ తేరీ సర్కే” (Sarke Chunar Teri Sarke) అంటూ సాగే ఈ పాటలో అశ్లీలత, అసభ్యత ఎక్కువగా ఉన్నాయంటూ తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనిపై జాతీయ మహిళా కమిషన్ (NCW) తీవ్రంగా స్పందించింది. ఈ విషయాన్ని కమిషన్ సుమోటోగా స్వీకరించి, ఆ పాటలోని అంశాలు అస‌భ్యంగా ఉండ‌ట‌మే కాకుండా భారతీయ న్యాయ సంహిత, ఐటీ చట్టం, పోక్సో (POCSO) చట్ట నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నాయని ప్రాథమికంగా నిర్ధారించింది. దీనిపై పూర్తి వివరణ కోరుతూ సంబంధిత నటీనటులు, సాంకేతిక నిపుణులకు నోటీసులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో నటి నోరా ఫతేహీ, నటుడు సంజయ్ దత్, గీత రచయిత రకీబ్ ఆలం, నిర్మాత వెంకట్ కె. నారాయణ, దర్శకుడు కిరణ్ కుమార్‌లను కమిషన్ ముందుకు హాజరుకావాలని ఆదేశించింది. వీరందరూ మార్చి 24న మధ్యాహ్నం 12.30 గంటలకు సంబంధిత పత్రాలతో కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుంది. ఒకవేళ విచారణకు హాజరుకావడంలో విఫలమైతే, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ హెచ్చరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>