epaper
Saturday, January 31, 2026
spot_img
epaper

కుప్పంలో చరిత్ర సృష్టించాం : సీఎం చంద్రబాబు

కలం, డెస్క్ : కుప్పంలో ఈ-సైకిళ్ల పంపిణీతో చరిత్ర సృష్టించామని సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం డ్వాక్రా మహిళలకు 5555 ఈ-సైకిళ్లను పంపిణీ చేశారు. శివపురం నుంచి ప్రజావేదిక దాకా ఈ-సైకిళ్లపై ర్యాలీ చేపట్టారు సీఎం చంద్రబాబు . దాదాపు 3 కిలోమీటర్ల దాకా సైకిల్ తొక్కుతూ వచ్చారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. కుప్పం నుంచే ఏపీలో తాము చరిత్రకు శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు.

రాబోయే రోజుల్లో ఈ వెహికల్స్ వినియోగంలో ఏపీ అందరికంటే ముందు వరుసలో ఉండాలని కోరారు సీఎం చంద్రబాబు. అందులో భాగంగానే కుప్పంలో 5555 ఈ సైకిళ్లను పంపిణీ చేయడం ద్వారా గిన్నీస్ రికార్డు సృష్టించామని తెలిపారు. గిన్నీస్ రికార్డును సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ అందుకున్నారు.

Chandrababu
Chandrababu

Read Also: ఢిల్లీకి చేరిన జనసేన ఎమ్మెల్యే వ్యవహారం..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>