కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా అరవ శ్రీధర్‌పై బాధిత మహిళ వీణ జాతీయ మానవహక్కుల కమిషన్(NHRC)కు ఫిర్యాదు చేసిది. దీంతో న్యాయవాది ఆజాద్ కేసు నమోదు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ కేసును విచారణకు స్వీకరించింది. మరోవైపు అరవ శ్రీధర్‌పై ఆరోపణలకు సంబంధించి వాస్తవాలు తేల్చేందుకు జనసేన పార్టీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విచారణలో తేల్చిన వాస్తవాల ఆధారంగా అరవ శ్రీధర్‌పై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఇంకోవైపు వీణ రోజుకో వీడియో విడుదల చేస్తుండగా అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.


